భారీ మార్పు దిశగా- మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం!

భారీ మార్పు దిశగా- మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్ సీఓఈ) ఆవిర్భవిస్తోంది. కంపెనీల చట్టం 2013 ప్రకారం సెక్షన్ 8 కంపెనీగా దీనిని రూపొందిస్తున్నారు. ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ ప్రతిపాదనను ఆమోదించింది.

* ఇండియన్ చాంబర్స్ అఫ్ కామర్స్ సమాఖ్య, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముంబయిలో ఎన్ సిఓఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు.

* దేశంలో ఏవీజీసీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి 2022-23 బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా ఇది ప్రారంభం అవుతోంది. 

*ఫిల్మ్ మేకింగ్, ఓవర్ ది టాప్ (ఓటీటీ), గేమింగ్, వాణిజ్య ప్రకటనలు, ఆరోగ్యం, విద్య, ఇతర సామాజిక రంగాలతో సహా మొత్తం మీడియా, వినోద రంగంలో ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగం నేడు ఒక అనివార్యమైన పాత్రను పోషిస్తుంది. దేశం అభివృద్ధి గమనంలో వెళుతున్నది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇంటర్నెట్, చౌక డేటా రేట్లతో పోటీ పడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఏవీజీసీ-ఎక్స్ఆర్ వినియోగం విపరీతమైన వేగంతో పెరగడానికి సిద్ధంగా ఉంది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .