అన్నింటికి ఒకటే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్

మంచిర్యాల రాజస్వ మండల అధికారి వి రాములు

IMG-20241002-WA0018

 

 

 

తెలంగాణ ముచ్చట్లు, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-

ప్రIMG-20241002-WA0017 భుత్వం ప్రజా సంక్షేమంలో భాగంగా చేపట్టే పథకాలు అర్హులైన వారికి అందించడంలో భాగంగా అన్నింటికీ ఒకటే ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ కొరకు పైలెట్ సర్వే నిర్వహించడం జరుగుతుందని మంచిర్యాల రాజస్వ మండల అధికారి వి రాములు అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణ, జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావుతో కలిసి పైలెట్ ప్రాజెక్టుకు సంబంధించిన మున్సిపల్ కమీషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు సర్వే నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల రాజస్వ మండల అధికారి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ పైలెట్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. పైలెట్ ప్రాజెక్టు కొరకు మంచిర్యాల నియోజకవర్గంలో దండేపల్లి మండలం అల్లిపూర్ గ్రామం, మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు-అశోక్ రోడ్, బెల్లంపల్లి నియోజకవర్గంలో కాసిపేట మండలం లంబడితండా (కె) గ్రామం, బెల్లంపల్లి

మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు- టేకులబస్తి, చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు మండలం సంకారం, చెన్నూరు మున్సిపల్ పరిధిలో 5వ వార్డులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గానికి రాజస్వ మండల అధికారి రాములు, బెల్లంపల్లి నియోజకవర్గానికి రాజస్వ మండల అధికారి హరికృష్ణ, చెన్నూరు నియోజకవర్గానికి జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి లను నోడల్ అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుండి 5 రోజుల పాటు సర్వే పూర్తి చేయాలని, 9వ తేదీన వివరాలను పరిశీలించి నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపరిచి 10వ తేదీన జిల్లా కలెక్టర్ కు నివేదిక అందించాలని తెలిపారు. ఒక కుటుంబానికి ఒక కార్డు ఉంటుందని, కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఒక ప్రత్యేక నంబర్ కేటాయించడం జరుగుతుందని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అన్నింటికీ ఒకే కార్డు అనుసంధానమై ఉంటుందని తెలిపారు. సర్వే ప్రక్రియలో భాగంగా ప్రజలకు ఒకేసారి పూర్తి వివరాలు సేకరించాలని, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారి నుండి వివరాలు సేకరించాలని, కుటుంబంలో వయస్సు రీత్యా పెద్దవారైన మహిళను కుటుంబ పెద్దగా నిర్ణయించి మిగిలిన వారిని ఆ వ్యక్తితో కలిగిన సంబంధంతో సహా వివరాలు నమోదు చేయాలని తెలిపారు. వివరాల నమోదు, ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉన్నట్లుయితే బృంద సభ్యులు వారి పరిధిలో గల మున్సిపల్ కమీషనర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని సంప్రదించాలని తెలిపారు. ముందుగా జాబితా ఇవ్వడం జరుగుతుందని, ఇట్టి జాబితాలో ఉన్న పేర్లు, వివరాలు సరి చూసుకోవాలని, మరణించిన వారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి పేర్లు నిబంధనల ప్రకారం తొలగించాలని తెలిపారు. నూతనంగా వచ్చిన వారి పేర్లు నమోదు చేయాలని, ఉమ్మడి కుటుంబంలో పెళ్లి అయిన వారు ఉంటే వేరుగా నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వం అందించనున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు వివిధ సంక్షేమ పథకాలకు ఉపయోగపడుతుందని, ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా సర్వే చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పైలెట్ ప్రాజక్టు సర్వేపై ప్రజలకు తెలిసే విధంగా టాం-టాం, ప్రచార విధానాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి, సర్వే సమయంలో అందుబాటులో ఉండేలా అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం సర్వే విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .