ఎమ్మెల్సీ ఆమేర్ అలీఖాన్ కు మైనార్టీ గ్రామీణ వైద్యుల వినతి

 

 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు 

IMG-20240929-WA0010(1)టీవల శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సీయాసత్ ఉర్డు దినపత్రిక చీఫ్ ఎడిటర్ ఆమేర్ అలీఖాన్ ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఖమ్మం నగరానికి విచ్చేయగా మైనార్టీ గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ర్టప్రభుత్వం ద్వారా ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపునివ్వాలని, అదే విధంగా మెడికల్ కౌన్సిలింగ్ దాడులు నిలిపివేయాలని ఆర్ఎంపీ, పీఎంపీలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని 50 సంవత్సరాలు దాటిని వారికి పింఛన్లు మంజూరు చేయడంతోపాటు డబుల్బెడ్రూం ఇళ్లులేదా, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రంలో కోరారు. స్థానిక టిఎన్జీఓ ఫంక్షన్ హాల్లో మైనార్టీ గ్రామీణ వైద్యుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ నజీరుద్దిన్, గౌరవ అధ్యక్షులు ఎక్కే.హసన్, జిల్లా అధ్యక్షులు ఎక్కే. హసన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జానీమియా, జిల్లా కోశాధికారి ఎస్కే. బాబుసాహేబ్, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ ఖాసీం, షేక్ చాంద్ పాషా లు ఎమ్మెల్సీ ఆమేర్ అలాఖాన్కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రత్యేక శిక్షణతో పాటు గుర్తింపునిచ్చారని గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా శిక్షణ ఇచ్చి గుర్తింపునిస్తామని తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఆర్ఎంపీ, పీఎంపీలకు తగిన న్యాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రాతినిద్యం వహిస్తారని తమకి విజ్ఞప్తి చేస్తున్నామని వినతి పత్రంలో సంఘం నాయకులు పేర్కొన్నారు. వినతిపత్రం సమర్పించినవారిలో జిల్లా జాయింట్ సెక్రటరీ షేక్ ఆశ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్. మహుమ్మద్ సాహేబ్, ప్రచార కార్యదర్శులు షేక్ అమీర్, షేక్ జానీ, కార్యదర్శులు షేక్ అబ్దుల్, షేక్ మస్తాన్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ మన్చుర్ అలీ, షేక్ షాజహాన్, షేక్ నబీ, షేక్ అలీ, షేక్ అహ్మద్ పాషా, షేక్ వలీ, షేక్ మహిముద్, షేక్ బాజీ, షేక్ రబ్బానీ, షేక్ ఇస్సాక్ పాషా తదితరులు ఉన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .