క్రీడస్పూర్తి చాటిన విజేతలకు ట్రోఫీలు అందజేసిన పోలీస్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు
ఆటల్లో గెలుపోటములు సహజమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం పరేడ్ మైదానంలో ట్రైనీ కానిస్టేబుళ్ల (సివిల్ & ఏ ఆర్) రెండు రోజుల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఆదివారం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యతిధిగా హజరైన పోలీస్ కమిషనర్ గారు ముందుగా క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ఈవెంట్లలో పోటీ స్ఫూర్తిని మెచ్చుకుంటూ విజేతలకు ట్రోఫీలు, పతకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ...పోలీస్ శిక్షణ కేంద్రంలో విజయవంతంగా తొమ్మిది నెలల శిక్షణ కాలం రెండు నెలలలో పూర్తి కానున్న నేపథ్యంలో ఈ ఆటల పోటీలు మరింత ఉత్సాహాన్ని, ఉపశమనాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని అన్నారు.
గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించి ఇదే టిమ్ స్పూర్తితో ముందుకు సాగుతూ ఉత్తమ ప్రతిభ కనబర్చాలని అకాంక్షించారు.
కార్యక్రమంలో సిటిసీ ప్రిన్సిపల్/ అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్ , ఏఆర్ అడిషనల్ డీసీపీ విజయబాబు, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, ఏసీపీలు రవి, సాంబరాజు, ఆర్ ఐ అప్పాలనాయుడు, నాగుల్ మీరా సిఐలు హనూక్, రాజిరెడ్డి, రమేష్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Comments