ఏలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలి

--పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి 

ఏలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రుణమాఫీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి మాట్లాడుతూ... రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విడతల వారీగా కాకుండా ఏకకాలంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో అర్హులైన రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని అన్నారు. అనంతరం పెద్దమందడి తహసిల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేణు యాదవ్, మాజీ ఎంపీపీ దయాకర్, పెద్దమందడి గ్రామ అధ్యక్షుడు సేనాపతి, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్, దొడగుంటపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి,కొమ్ము చెన్నయ్య, శివారెడ్డి, బలిద్ పల్లి ఆంజనేయులు, చిన్న, శంకర్, మాసన్న, సాయికుమార్, నాగేంద్ర యాదవ్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .