ప్రభుత్వ సాయంతో పాటు మా సాయం కూడా...!

- శుక్రవారం సాయంత్రనికల్లా బాధితుల అకౌంట్లలోకి రూ. 10వేలు

ప్రభుత్వ సాయంతో పాటు మా సాయం కూడా...!

IMG-20240905-WA0063

*ఖమ్మం రూరల్ మండల పర్యటనలో మంత్రి పొంగులేటి

- ద్విచక్రవాహనం పై తిరుగుతూ వరద సహాయక చర్యలు పరిశీలన

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు:

పాలేరు నియోజకవర్గంలోని వరద ముంపు బాధితులకు ప్రభుత్వ సాయంతో పాటు పొంగులేటి స్వరాజ్యం - రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరుపున తమ వంతు సాయం కూడా అందించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వాహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని రాజీవ్ గృహకల్ప, కరుణగిరి, నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీ, జలగం నగర్, పెద్దతండా, కె.బి.ఆర్ నగర్, అభయటౌన్ షిప్, దానవాయిగూడెం, రామన్నపేట తదితర ప్రాంతాల్లో బాధితులకు అందుతున్న వరద సహాయక చర్యలను ద్విచక్రవాహనం పై కలియతిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వరద ముంపు బాధితులకు శుక్రవారం సాయంత్రం కల్లా రూ.10వేల వారి అకౌంట్లలోకి జమ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతీ ఇంటికి వరద సాయం అందజేస్తామని బాధితులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కట్టు బట్టలతో సహా అనేక కుటుంబాలు నష్టపోయాయన్నారు. మహిళలకు రెండు చీరలు, పురుషులకు రెండు లుంగీలతో పాటు రెండు టీ షార్ట్ లను అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .