ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టర్, వైరా పట్టణంలో సీఎం సభాస్థలిలో చేపడుతున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సభ వేదిక, వాహనాల పార్కింగ్, హెలీప్యాడ్, బ్యారీకెటింగ్ ఏర్పాట్ల పట్ల అన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు. పర్యటనలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అధికారులు, వారికి కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. పార్కింగ్ స్థలాలు, ప్రవేశం మార్గం, నిష్క్రమణ మార్గాల్లో ఏలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. డయాస్ పై ప్రోటోకాల్ లో తప్పిదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, డిఆర్డీవో సన్యాసయ్య, ఆర్డీవోలు గణేష్, రాజేందర్, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.


Comments