బీఆర్ఎస్ నుండి రెండోసారి మండలి చైర్మన్ గా..
Views: 11
On
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. మొదటి సారి టీడీపీ నుంచి, రెండు సార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో మూడో సారి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన గుత్తా ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తన ఎంపీ పదవి కాలం పూర్తయిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమితికి తొలి చైర్మన్‌గా బాధ్యతలు వ్యవహరించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై, మండలి చైర్మన్ అయ్యారు. రెండో సారి కూడా మండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ కానీ, శాసన మండలి చైర్మన్ గా ఎన్నికైన వారు అంతకుముందు ప్రాతినిధ్యం వహించిన పార్టీల ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తారు. దీంతో వారు ఏ పార్టీకి చెందిన వారై ఉంటారు.
తాజా వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ లో దుమారం..
శాసన మండలి చైర్మన్ గుత్తా.. పొలిటికల్ కామెంట్స్ పార్టీ బీఆర్ఎస్‌లో కాకరేపుతున్నాయి. మండలి చైర్మన్ గా రెండో సారి ఆ పదవిని కట్టబెట్టిన బీఆర్ఎస్ పై అవకాశం వచ్చిన ప్రతిసారీ విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో కలకలం రేపాయి. కృష్ణా బేసిన్ లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారని, దీంతో నల్గొండ జిల్లాకు అన్యాయం చేశారని విమర్శించారు. గోదావరి నదిపైన ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను అశ్రద్ధ చేశారని విమర్శలు సంధించారు. గత ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధ, కృష్ణా బేసిన్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై చూపలేదని గుత్తా విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి, జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఆయన సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు సూచించారు. SLBC సొరంగ మార్గం ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే నల్గొండ జిల్లాకు మేలు జరిగేదని గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో దుమారం రేపుతున్నాయి.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments