ఆశా వర్కర్ లక్ష్మీ కుటుంబాన్ని ఆదుకోవాలి
Views: 4
On
మక్తల్, తెలంగాణ ముచ్చట్లు:
పనిభారంతో మృతి చెందిన లక్ష్మీ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ,జక్లేర్ జాతీయ రహదారిపై ఆశా వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు. ఆగస్టు 21న రోజువారీ డ్యూటీ నిర్వహించి రాత్రి 11:30 గంటల వరకు రికార్డ్స్ రాసే పనిలో ఉండి కళ్ళు తిరిగి పడిపోగా ఆశ వర్కర్ లక్ష్మి ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ ఈనెల ఒకటవ తారీకు రోజు మరణించిందని,సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోవింద్ రాజ్ తెలిపారు. ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు కర్ని పీ హెచ్ సీకమిటీ అధ్యక్షురాలు గోవిందమ్మ, ఇందిరమ్మ, యశోద, అమీనా బేగం, అనిత, నాగమ్మ, సుజాత, లక్ష్మి, అనురాధ, వెంకటమ్మ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments