పిసిసి అధ్యక్ష పీఠంపై బిసి

హర్షం వ్యక్తం చేసిన నాయకులు,కార్యకర్తలు  

పిసిసి అధ్యక్ష పీఠంపై బిసి

IMG-20240906-WA0069 -స్టేషన్ ఘనపూర్ సంబరాలు జరుపుకున్న కార్యకర్తలు,నాయకులు 

స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు:

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ సింగాపురం ఇందిర ఆదేశాల మేరకు శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎంపిటిసిల ఫోరమ్ స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షులు ,

కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగపురం దయాకర్ ఆద్వర్యంలో తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమితులైన సందర్భంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా సింగపురం ఇందిరా కార్యాలయం వద్ద నాయకులు,కార్యకర్తలు భారీ ఎత్తున టపాసులు కాల్చి, స్వీట్ లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా సింగపురం దయాకర్ మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా పార్టీ నమ్ముకుని పార్టీలోనే ఉన్నారని,పదవుల కోసం ఏనాడూ పార్టీలు మారలేదని అలాంటి నిబద్దత కలిగిన వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ అని,ఆయనకు పీసీసీ పదవి ఇవ్వడం సమంజసమని,ఒక బిసి నాయకునికి పీసీసీ అధ్యక్షా పదవి ఇచ్చిన అధిష్టానానికి సింగపురం దయాకర్ కృతజ్ఞతలు తెలిపారు.మహేష్ కుమార్ గౌడ్ విద్యార్థి నాయకుడిని

 (ఎన్ఎస్ యూఐ )నుండి అంచలంచెలుగా ఎదిగారని కొనియాడారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గుర్రం యాదగిరి, సింగపురం నాగయ్య,సింగపురం రాజు,శ్రీధర్,నరసింహ్మ,రేండ్ల సమ్మయ్య,ప్రతీష్,నెంబర్ ఎల్లయ్య,గట్టు రమేష్,కోటి,దుబాయ్ ఎల్లయ్య,జానీ పాషా,చింత జ్యోస్త్న, సింగపురం వెంకటయ్య,రమేష్,మేకల మల్లేష్ కాంగ్రెస్ పార్టీ మండల,

గ్రామ,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .