భారీ"ష్ తో బీ కేర్ ఫుల్

ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు

భారీ

సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని ఫోన్లో సూచన

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు:

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మరో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిందని కావున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజలందరని అప్రమత్తం చేయాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లను తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లో ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేయాలని సూచించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తెలుసుకోవాలని సూచించారు. భారీ వర్షాలతో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయని అందువలన అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుండి వచ్చేలా సూచనలు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను పరిష్కరించాలని సూచించారు. ఎప్పటికప్పుడు సంభందిత అధికారులతో మాట్లాడాలన్నారు. సహాయక చర్యలు అవసరమైతే చేపట్టే విధంగా ముందస్తు జాగ్రత్తగా ఉండాలని రెండు జిల్లాల కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచించారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .