పాత కడియం శ్రీహరి లాగా ఉండు * మాజీ ఎమ్మెల్యే డా.రాజయ్య - గడిచిన 8 నెలలు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు
నీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్ట పడ్డారు,అక్రమ అరెస్టులు,ప్రతీకార చర్యలు మానుకో
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్,అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు మారపాక రవి ఆధ్వర్యంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య వేడుకలలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు .
ఈ సంధర్భంగా డా.రాజయ్య గారు మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలు కేసిఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రము భారత దేశంలోనే నెంబర్ 1గా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది.కానీ గడచిన 8 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. రైతు రుణమాఫి పథకంతో రైతుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది, కల్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం విషయం పక్కనపెడితే ,కల్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది.రైతు భరోసా అనే మాటే లేదు...
మన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిస్థితి మరి ధారుణంగా అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన కడియం శ్రీహరి వైఖరి రోజురోజుకు పాత కడియం శ్రీహరి గారి లాగా మారిపోతుంది.
1994లో ఎలా అయితే అక్రమ అరెస్టులకు పాల్పడ్డాడో, ఇప్పుడు కూడా అదే విధంగా అక్రమ అరెస్టులకు మళ్లీ తెర తీస్తున్నారు...
కడియం శ్రీహరి గారు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి, పాత కడియం శ్రీహరి లాగా కాకుండా మారిన కడియం శ్రీహరి లాగా ఉండండి.. ఎందుకంటే మీకోసం అన్ని పార్టీల వారు కష్టపడ్డారు.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గెలుపు కోసం ఎంతగానో కష్టపడ్డారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కూడా మీతో కలిసి పని చేస్తున్నారు.. కాబట్టి మీరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ అభివృద్ధి పైన దృష్టి పెట్టండి, అంతేకానీ అక్రమ అరెస్టులు, కక్ష సాధింపు చర్య చర్యలకు పాల్పడకుండా ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి పెట్టండి....
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని 7 రిజర్వాయర్లు ప్రస్తుతం ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి, ప్రతి సంవత్సరం మే, జూన్ నెలలో రిజర్వాయర్ లు నిండి జూలై నెలలో కాలువలకు వదిలే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ,దాని వలన రైతుల తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి కడియం శ్రీహరి ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టి నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి ...
మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా మీరు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు, మీకు నేను అండగా, మీ కుటుంబ సభ్యుడిగా ఎప్పుడూ మీకు తోడుంటాను..
మరొక్క సారి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని తెలిపారు....
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు ,పార్టీ ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, యువకులు తదితరులు పాల్గొన్నారు


Comments