“భారీ”ష్ పట్ల అప్రమత్తంగా ఉండాలి...!
- ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచన
Views: 8
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
రాబోయే రెండు మూడు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిందని కావున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు సూచించారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితిని అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments