పెద్దమందడి బిసి వసతి గృహాన్ని సందర్శించిన బిజెపి నాయకులు

శిథిలావస్థలో ఉన్న వసతి గృహానికి మరమ్మత్తులు చేపట్టాలి

పెద్దమందడి బిసి వసతి గృహాన్ని సందర్శించిన బిజెపి నాయకులు

---బిజెపి మండల అధ్యక్షుడు తిరుపతయ్య 

వనపర్తి జిల్లా ప్రతిని తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి మండలంలోని బిసి బాలుర వసతి గృహాన్ని సోమవారం బిజెపి మండల అధ్యక్షుడు తిరుపతయ్య ఆధ్వర్యంలో బిజెపి నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కావలి తిరుపతయ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు వసతి గృహంలో సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వసతి గృహం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వలన విషపూరిత పాములు రావడం వలన విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారని, వెంటనే విద్యార్థులకు వసతి గృహంలో సరైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముప్పూరి చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి చిన్నగుంట రాములు, కోశాధికారి కమ్మరి సురేందర్, సోషల్ మీడియా కన్వీనర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .