పెద్దమందడిలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

పదివేల సభ్యత్వాలు నమోదు చేయాలని నిర్ణయం

పెద్దమందడిలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

---మండల అధ్యక్షుడు తిరుపతయ్య 

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

పెద్దమందడి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు తిరుపతయ్య అధ్యక్షతన గురువారం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు తిరుపతయ్య మాట్లాడుతూ... మండల సభ్యత్వ నమోదు కన్వీనర్ విష్ణువర్ధన్ సూచన మేరకు మండలంలో పదివేల సభ్యత్వాలు నమోదు చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. విష్ణువర్ధన్ సూచన మేరకు ప్రతి ఒక్క కార్యకర్త పట్టుదలతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మిగతా మండలాల కన్నా పెద్దమందడి మండలంలో బిజెపి పార్టీ మెజార్టీ ఓట్లను సాధించిందని ఈ సందర్భంగా తిరుపతయ్య గుర్తు చేశారు. మండలంలోని అన్ని గ్రామాలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి మండల అధ్యక్షుడు తిరుపతయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కార్యదర్శి కొత్తకాపు శివారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ముప్పురి చెన్నయ్య, యాదయ్య, సురేందర్, కరుణాకర్, దత్తాత్రేయ రెడ్డి, రాములు, రవి, నరేష్, రవి, విటల్ రెడ్డి, స్వాతి, కృష్ణయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. వెంకటయ్య, వెంకటేష్, రాముల యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .