రైతాంగం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు
ఓయూ జేఏసీ నాయకుడు ఇప్ప పృథ్వి రెడ్డి
తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల :
రైతాంగం గురించి వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని తెలంగాణ ఉద్యమకారుడు,ఓయూజేఏసీ నాయకుడు ఇప్ప పృథ్వి రెడ్డి అన్నాడు.సింగరాజుపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు రైతుల కోసం ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని,కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేయడం మింగుడు పడక బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ధర్నాలు చేస్తుందని,బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో లక్షరూపాయల ఏకకాల ఋణమాఫీ చేస్తానని చెప్పి అసలుకు బదులు వడ్డీ మాత్రమే మాఫీ చేసారని,గిట్టుబాటు ధర కోసం పోరాడిన మిర్చి రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని,రైతాంగానికి ఉచిత ఎరువులు ఇస్తానని మోసం చేసిన విషయం తెలంగాణ ప్రజలు ఇంకా మరిచిపోలేదని,కౌలు రైతులను గుర్తించడానికి నిరాకరించి,పోడు వ్యవసాయం చేస్తున్న రైతులపై దాడులు చేసిన వారు రైతుల గురించి మాట్లాడడం మొసలి కన్నీరు కార్చడం వంటిదని,బీఆర్ఎస్ పార్టీ నాయకుల అహంకారం,అవినీతి,కుంభకోణాలు,భూదందాల కారణంగానే గత ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టు సమాధానం చెప్పారని,ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ బీఆర్ఎస్ నాయకుల అహంకారం తగ్గలేదని,మాట తీరు,పద్ధతులు మారలేదనని,బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ విశ్వసించరని,చరిత్ర పుటల్లో బీఆర్ఎస్ పార్టీ కలిసిపోయిందని,కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు స్వర్ణయుగం అనుభవిస్తున్నారని,ఇచ్చిన మాట ప్రకారంగా 2లక్షల రూపాయల ఋణమాఫీ చేసారని,సాంకేతిక కారణాల వలన కొందరు రైతుల అకౌంట్లలో ఋణమాఫీ నగదు జమ కాలేదని,సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అధికారులను నియమించిందని,రైతులెవరూ ఆందోళన చెందవద్దని,ప్రతి రైతుకు 2లక్షల రూపాయల ఋణమాఫీ జరుగుతుందని,త్వరలో 12,500 రూపాయల రైతుభరోసా,కౌలు రైతులు,వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సహాయం,వరికి 500 రూపాయల బోనస్ వంటి అనేక పథకాలు అమలు కానున్నాయి అన్నారు.ఈ కార్యక్రమంలో నీర్మాల గ్రామ పార్టీ అధ్యక్షుడు చింతల రవీందర్, పెద్దమడూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం, సీనియర్ నాయకులు వడ్లకొండ ప్రశాంత్, లేగ అమర్నాథ్ రెడ్డి, దారావత్ తండా అధ్యక్షుడు రవీందర్,మండల యువజన నాయకులు తాళ్లపెల్లి వేణు,తదితరులు పాల్గొన్నారు.


Comments