బిఆర్ఎస్ నోట ఉప ఎన్నిక జూట మాట

-కొలిపాక సతీష్

బిఆర్ఎస్ నోట ఉప ఎన్నిక జూట మాట

IMG-20240909-WA0049స్టేషన్ ఘనపూర్: తెలంగాణా ముచ్చట్లు

రాష్ట్రములో ఉప ఎన్నికలు రావని బీ ఆర్ ఎస్ పార్టీ నాయకుల భ్రమేనని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను బి అర్ ఎస్ పార్టీలోకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోలేదా..?అని 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ కొలిపాక సతీష్ ప్రశ్నించారు. బీ అర్ ఎస్ నాయకులు పగటి కలలు కాంతున్నారని వారి ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన కాలములో ప్రజలకు ఒరగబెట్టింది ఏమిలేదని అన్ని జూట మాటలేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేస్తుందని దీన్ని చూసి ఓర్వడం లేదని దయ్యబట్టారు. రాబోయే రోజుల్లో బి.ఆర్. ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందన్న భయం వారికి పట్టుకుందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వం లో వచ్చే 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు రావడానికి ఎదురు చూస్తున్నాడు బి ఆర్ ఎస్ నాయకులకు వారి పార్టీ మునుగుతుందని ఆ పార్టీ బ్రతికి బట్ట కట్టే పరిస్థితులు లేవని తెలిసే ఏమి చేయాలో తేలియక మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఇప్పటి కైనా ఇలాంటి చౌక బారు మాటలు మానలని మీరు చేయని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు.

*గుర్రం సుధీర్ స్థానికులు*

గతంలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలో నుండి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్న సంగతి అప్పుడే మర్చిపోయి చౌక బారు మాటలు మాట్లాడుతూ మధ్యంతర ఎన్నికలు వస్తాయి అని అనడం హాస్యస్పదమన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ నుండి ముగ్గురు బయటికి వస్తేనే తీర్పులని డ్రామా చేస్తున్నారు. గతంలో 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఈ చట్టాలు కోట్లు గుర్తు రాలేదని అప్పుడు అధికారంలో ఉన్న ఎంతమంది నైనా ప్రతిపక్ష పార్టీల నుండి చేర్చుకోవచ్చు ఫిర్యాయింపులు జరిగించొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీలకు బిఆర్ఎస్ నుండి గెలిచిన అభ్యర్థులు వెళితే మాత్రం కోర్టు కేసులు తీర్పులు అంటూ మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ ప్రచారాలు చూపిస్తూ ప్రజలను ఆందోళన గురి చేయడమే తప్ప వేరేమీలేదన్నారు. 

ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు చేయొద్దని హెచ్చరించారు. ఒకవేళ మధ్యంతర ఎన్నికలే వస్తే మా అభిమాన నాయకుడు కడియం శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపించుకునే సత్తా మాకు ఉందన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .