వరద బాధితులకు కేంద్ర సాయం..

కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు!

వరద బాధితులకు కేంద్ర సాయం..

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

వరదల్లో చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ₹3లక్షలు వస్తాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

* తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ₹5లక్షల్లో కేంద్రం ఇచ్చే  ₹3లక్షలు కలుపుకొని ఇస్తారా? లేదా రాష్ట్ర ప్రభుత్వమే రూ. ₹5లక్షలు ఇస్తోందా? అనే విషయంపై క్లారిటీ లేదని కిషన్ రెడ్డి అన్నారు.

* ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి.. వారం కంటే ఎక్కువ రోజులు ఉంటే ₹16వేలు, వారం లోపు ఆస్పత్రిలో ఉంటే ₹4 వేలను ఆస్పత్రి ఖర్చులకు కేంద్రం ఇస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
 *ఎస్డీఆర్ఎఫ్ నిధులతో* బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. యుటిలైజేషన్ నిధులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి రిపోర్ట్ విడుదల చేయలేదని చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్ కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద ₹1300 కోట్లకు పైగా నిధులు ఉన్నాయని తెలిపారు. మరో ₹200 కోట్లు యూసీ నిధులున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తే కేంద్ర ప్రభుత్వం దానికి తగిన నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పారు. అంటు వ్యాధులు సోకకుండా మెడిసిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
*సెప్టెంబర్ 17 ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. 1948లో నిజాం లొంగిపోయిన రోజు... గణేష్ నిమజ్జనం ఒకేరోజు జరిగిందని చెప్పారు. మళ్లీ 75ఏళ్ల తర్వాత ఇది రిపేట్ అవ్వడం సంతోషమని కిషన్‌రెడ్డి వెల్లడించారు.*

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .