ఇచ్చిన మాట తప్పని పార్టీ కాంగ్రెస్
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల :
ఇచ్చిన మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు.దేవరుప్పుల మండలం సీతారాంపురంలో మండల పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రతన్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ముదిరాజ్ కుల పెద్దలు పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీలు అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.ముఖ్యంగా రైతన్నలకు రెండు లక్ష రుణమాఫీ చేయడం సంతోష దయాకమని మునుపెన్నడు దేశవ్యాప్తంగా మరే రాష్ట్రంలోని ఏ పార్టీ చేయని రెండు లక్షల వరకు రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేసి చూపెట్టిందని హర్షం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలు చూసి ఇతర పార్టీలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.పార్టీలో చేరిన వారు దండు రాములు,నిమ్మల బయ్యలు,తునికి అంజయ్య,అంబటి సోమయ్య,తునికి సత్తయ్య,తునికి కొండయ్య,తరాల వీరస్వామి,సౌడబోయిన యాదగిరి,అంబటి నరేష్,నిమ్మల యాకన్న,అంబటి సోమనర్సయ్య,నిమ్మల గణేష్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు,గ్రామ శాఖ అధ్యక్షుడు వరికెలా రతన్ జీ,మండల నాయకులు ఉప్పుల సురేష్ బాబు,కాసారపు ధర్మారెడ్డి, మామిడాల తిరుపతి రెడ్డి,రెడ్డి రాజుల రమేశ్,దావేర అనిల్ కుమార్,తోటకూరి పాండు కృష్ణ,ఆవుల సురంజన్ రెడ్డి,బోనగిరి యాకస్వామి,బిసిసెల్ అధ్యక్షుడు కాడబోయిన గణేష్,పులిగిల్ల వెంకన్న,యూత్ నాయకులు, కార్యకర్తలు,మహిళా నాయకురాళ్ళు,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.


Comments