సీనియర్ కార్యకర్తకు నివాళులర్పించిన డా.చిన్నారెడ్డి

సీనియర్ కార్యకర్తకు నివాళులర్పించిన డా.చిన్నారెడ్డి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

పెద్దమందడి మండలం, మోజర్ల గ్రామానికి చెందిన గట్టు సైకిల్ నరసింహ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త, నిన్న మరణించిన విషయం, గ్రామ కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి నరసింహ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మంగళవారం రోజు డాక్టర్ జి.ఆదిత్య రెడ్డి గట్టు సైకిల్ నరసింహ పార్థివ దేహానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులకు రూ,5000 ఆర్థిక సాయం చేశారు. చిన్నారెడ్డి గారు కూడా నరసింహ భార్య లక్ష్మి కి కొంత ఆర్థిక సహాయం చేశారు. నరసింహ మరణ వార్త విని దిగ్బాంతి చెందాను అని అన్నారు. నరసింహ బిడ్డలకు విద్యాపరంగా నాణ్యత మైన విద్యను అందిస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. పెద్ద కూతురు ఉద్యోగం పరంగా అవకాశం ఇవ్వడానికి సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. నరసింహ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. నరసింహ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని అండగా ఉంటుందని వాళ్ల కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చారు.

గ్రామ మాజీ సర్పంచులు మార్చ నాగరాజు, మాజీ సర్పంచ్ గట్టు మన్యం, పెద్దమందడి సింగల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు గట్టు దయాకర్, గట్టు బాబురావు, ఆటో రాములు యాదవ్ , గట్టు రాజు, బుచ్చి లింగం, పెద్ద సత్తిరెడ్డి, భాజ శీను, సింగం నాగన్న. గట్టు పెంటన్న. గట్టు భగవంతు. గట్టు ధనంజయ్ ,గట్టు రమేష్, జానం పల్లె మన్యం, నెంబర్ రాజు, గట్టు చిన్న వెంకటన్న, గట్టు కొండన్న, గట్టు వెంకటేష్, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .