ఎమ్మేల్యే వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఫ్యాన్ల వితరణ
మక్తల్, తెలంగాణ ముచ్చట్లు:
నియోజకవర్గంలో విద్యాలయాల అభివృద్ధికి అందరూ కలిసి రావాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అందులో భాగంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువ నిధులను రూ. 17 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు .వాటితో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో మక్తల్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు బోయ రవికుమార్, ఇతర కాంగ్రెస్ బృందం సమిష్టిగా సేవా గుణాన్ని చాటుకున్నారు. వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి పేరిట ఎమ్మెల్యే చేతుల మీదుగా బీసీ బాలుర గురుకుల పాఠశాల మక్తల్ కు 20 సీలింగ్ ఫ్యాన్లను పాఠశాల ప్రిన్సిపాల్ సెన్రీ సిబ్బందికి అందజేశారు. గత నెల ఆగస్ట్ 14వ తేదీన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బీసీ గురుకులంలో నిద్ర చేయగా,విద్యార్థులు ఫ్యాన్లు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ఆమేరకు మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫ్యాన్లను ఆందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ,పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందరూ కలిసి,బీసీ గురుకుల విద్యార్థులకు ఫ్యాన్లు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఇదేవిధంగా మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా ఉన్నతస్థాయి లోనివారు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. దాదాపుగా ప్రస్తుతం అన్నీ పార్టీలలోని ప్రజాప్రతినిధులు నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిన వారు ఉన్నారని వారంతా కూడా తాము చదువుకున్న పాఠశాలలో పాఠశాల అభివృద్ధి కనీస మౌలిక వసతుల కల్పనకు ముందుకు రావాలని అన్నారు .ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించవలసిందిగా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వపరంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు నియోజకవర్గంలో రూ. 17 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లోనూ 30 శాతం నిధులు పాఠశాలల అభివృద్ధికి కెటాయించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రతి ఒక్కరూ తమవంతుగా విద్యాలయాల అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ,కేజీబీవీ విద్యాలయాలు అన్నింటిలోనూ విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనకు తమ వంతు సహకారం అందించవలసిందిగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి విజ్ఞప్తి చేశారు. గత నెల 14న మక్తల్ పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాలలో రాత్రివేళ నిద్రించిన సందర్భంగా ప్రతి నెల ఒక గురుకులంలో నిద్రించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆ సందర్భంగా అక్కడి విద్యార్థులకు ఫ్యాన్లు లేని విషయాన్ని విద్యార్థులు తెలియజేయడం జరిగిందన్నారు. ఆమేరకు ఫ్యాన్లు అందజేసేందుకు పట్టణ కాంగ్రెస్ నాయకులు ముందుకు రావడం అభినందనీయమని అంటూ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ రవికుమార్ తో పాటు సేవా కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. అయితే తన పేరుతో సేవా సమితి పేరిట కార్యక్రమాలు చేపట్టడం కన్నా ఒక సేవ సమితిగా ఒక పేరును నిర్ణయించి సేవా కార్యక్రమాలను ఇక ముందు కూడా కొనసాగించవలసిందిగా ఆయన పట్టణ కాంగ్రెస్ నాయకులకు సూచించారు. తాను రానున్న రోజుల్లో పాఠశాలలో వసతుల కల్పనకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జి. లక్ష్మారెడ్డి, నాయకులు కట్టా సురేష్ కుమార్ గుప్తా, బి.గణేష్ కుమార్, ఆనంద్ గౌడ్, చంద్రకాంత్ గౌడ్, బోయ వెంకటేష్, కట్టా వెంకటేష్, శీను ,నూరుద్దీన్, హుసాముద్దీన్, సాదిక్, ఫయాజ్, ఓబ్లేశ్ కావలి రాజేందర్, కల్లూరి గోవర్ధన్, గుంతలి రవి, బోయ నర్సింహ, మెకానిక్ రాము తదితరులు పాల్గొన్నారు.


Comments