రుణమాఫీ లో దొందూ,దొందే!? --ఆమ్ఆద్మీపార్టీ ధ్వజం!    

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

రుణమాఫీ విషయంలో కాంగ్రెస్, బిఆర్యస్ రెండు ప్రజల్ని మోసగించాయని ఆమ్ఆద్మీపార్టీ తెలంగాణా కోర్కమిటీ సభ్యులు నల్లమోతు తిరుమల రావు, ఆమ్ఆద్మీపార్టీ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వర్ణ సుబ్బారావు లు నేడొక పత్రికా ప్రకటనలో విమర్శించారు.మన్మొహన్ సింగ్ చేసిన రుణమాఫీ మాత్రమే సంపూర్ణ మైన రుణమాఫీ గా పేర్కొన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక తప్పుడు నిభందనలు పెట్టి  హడావిడి గా 25శాతం రైతుల వడ్డీ మాత్రమే , బిఆర్యస్ ప్రభుత్వం మాపీ చేసిందని,గత అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులు రుణమాఫీ సంపూర్ణంగా చేస్తామన్న కాంగ్రెస్ ,అదికారంలోకి వచ్చిన కాంగ్రేసు ప్రభుత్వం అనేక నిభందనలు,హార్డిల్స్ పెట్టి 50శాతం రైతులు రుణమాఫీ మాత్రమే చేశారని అన్నారు.కాంగ్రేస్, బిఆర్యస్ పార్టీలకు రుణమాఫీ గురించి చెప్పుకునే అర్హత గానీ,సవాళ్ళు, ప్రతిసవాళ్లు చేసుకునే నైతికత కానీ వారికి లేవని అన్నారు.ఈరెండుపార్టీలు రైతు రుణమాఫీ విషయంలో చెప్పిన దానికి, చేసిన దానికి మద్య చాలా వ్యత్యాసం ఉందని, ఇరువురు రైతుల్ని నిలువునా దగా చేశారనిఅన్నారు,కొందరు సన్న,  చిన్న కారు రైతులు రేషన్ కార్డులు లేక రుణమాఫీ అర్హత కొల్పోతే! కౌలు రైతులు,పోడు రైతుల గురించి అసలు పట్టించుకోలేదని విమర్శించారు.వీరిద్దరి రుణమాఫీ వ్యవహారం రచ్చకెక్కిన తోడికోడళ్ళు మాదిరిగా తిట్టుకోవడం తప్ప! రైతుల్ని మోసగించడం లో దొందూ-దొందేనని అన్నారు.సవాళ్ళు ప్రతిసవాళ్లు మాని గ్రామాల్లోకి వస్తే ఈరెండు పార్టీ లో దొంగ వ్యవహారం రైతులే బహిర్గతం చేస్తారని అన్నారు.ఎన్నికలముందు సంపూర్ణ రుణమాఫీ హామీ ఇచ్చిన ఈరెండు పార్టీల నాయకులు సవాళ్ళు మాని రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారాప్రకటనలో కోరారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు దిద్దుకొని 5ఎకరాలలోపు రైతులు రుణమాఫీ హామీ ప్రకారం జీఓ లో నిభందనలు తొలగించి రుణం మాఫీ చేయాలని కోరారు.ఎవరెన్ని ప్రచారం రుణమాఫీ పై చేసుకున్న వారి నిభందనల మోసానికి గురైనరైతుల ఆగ్రహాన్ని చవిచూడకతప్పదని అన్నారు.అసత్యప్రచారాలు మాని ఇప్పటికైనా ప్రభుత్వం తప్పు సరిదిద్దుకొని సంపూర్ణ రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .