అధైర్య పడకండి ఇందిరమ్మ ప్రభుత్వం మీకు అండగా ఉంది
మీ కష్టాలను కన్నీళ్లను తుడవడానికి మీ దగ్గరికి వచ్చాను
వరద ముంపు బాధితులకు భరోసా ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ముంపు ప్రాంత నిరాశ్రయులకు తక్షణమే నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశం
ముదిగొండ లో ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు ధైర్యాన్ని కల్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
"మీ కష్టాలను తీర్చడానికి... మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను. మీరు అధైర్య పడకండి. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుందని" వరద ముంపు ప్రాంతాల బాధితులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. మంగళవారం మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం, పండ్రేగుపల్లి గ్రామాలలో మున్నేరు వరద ముంపు ప్రాంతాలను డిప్యూటీ సీఎం పరిశీలించారు. న్యూ లక్ష్మీపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పెద్ద బొంగు వీరబాబు, పల్లె పొంగు కళావతి ఇండ్ల లోకి నీరు చేరడంతో తడిసిన వస్తువులను పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు. తక్షణమే ప్రభుత్వం నుంచి నిత్యవసర సరుకులను ఇప్పిస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఎస్సీ కాలనీకి వరద
ముంపు రాకుండా శాశ్వత పరిష్కారం చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత పండ్రేగుపల్లి లో మున్నేరు కరకట్ట తెగి ఇండ్ల లోకి నీరు వచ్చిన డబుల్ బెడ్ రూమ్ కాలనీని సందర్శించారు. వర్షాలకు దెబ్బతిని కూలిపోయిన వజీర్ పాషా రేకుల ఇంటిని పరిశీలించి బాధితులకు మనోధైర్యం కల్పించారు. కరకట్ట తెగి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులను పంపించి ప్రాథమికంగా పంట నష్టం అంచనా వేయించిన తర్వాత పరిహారం అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. పండ్రేగుపల్లి తండాలో వర్షానికి కూలిపోయిన ఖమ్మం -కూసుమంచి 132 కెవి
హై టెన్షన్ టవర్ ను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పనులు చేయాలని ఏడి బాబు నాయక్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న ఇతర టవర్ల పరిస్థితుల గురించి ఆరా తీశారు. వరద ముంపు బాధితులకు తక్షణ సాయం కింద నిత్యవసర సరుకులను అందజేయాలని తహసిల్దార్ కరుణాకర్ రెడ్డిని ఆదేశించారు. నీట మునిగిన పంట పొలాల వివరాలు నష్టం అంచనాలు వెంటనే తయారుచేసి ప్రాథమిక నివేదిక పంపించాలని మండల వ్యవసాయ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ముదిగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు ఆయా గ్రామ శాఖల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Comments