శీనన్న చొరవతో మున్నేరు నిర్వాసితులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు
- ప్రతిపక్షాలు వరదల పై బురద రాజకీయాలను మానుకోవాలి
- హైడ్రా పెట్టిందే కబ్జాదారుల ఆటకట్టించడానికి
- మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
- నాయుడుపేట, జలగంనగర్ వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
మంత్రి పొంగులేటి శీనన్న చొరవతో మున్నేరు నిర్వాసితులందరికీ ఇళ్ల స్థలం లేదా డబుల్ బెడ్ రూం ఇళ్లు వస్తాయని, వరదల పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న బురద రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ప్రవేశపెట్టిందే కబ్జాదారుల ఆటకట్టించడానికి అని తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట, జలగం నగర్ లోని వరద బాధితులకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తో కలిసి నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అడ్డగోలు అనుమతులు ఇవ్వడం ద్వారానే అనేక మంది పేదలు ఈనాడు వరద బాధితులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ప్రత్యక్షంగా వచ్చి పేదల బాధలను చూసి చేతనైనా సాయం చేయాలని హితవు పలికారు. అంతే తప్ప వరదలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కల్లెం వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కర్లపూడి భద్రకాళి, మాజీ సర్పంచ్ లు బండి జగదీశ్, మద్ది వీరా రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, సురేష్ నాయక్, మెండె వెంకటేశ్ యాదవ్, అంబటి సుబ్బారావు, తమ్మినేని నవీన్, బానోతు హరి, వెంకట నారాయణ, రానేరు మురళీ, కరాటే వేణు, బానోతు సాయి, గుగులోతు శ్యాం తదితరులు పాల్గొన్నారు.


Comments