వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన తండ్రి, కూతుర్లకు రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

- కుటుంబ సభ్యులకు చెక్ అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన తండ్రి, కూతుర్లకు రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

 

IMG-20240904-WA0052

- చెక్ తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి

మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ లతో కలిసి బుధవారం అందజేశారు. కారేపల్లి మండలం గంగారాం తండా కు చెందిన మోతీలాల్, ఆయన కుమార్తె అశ్విని వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయి మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించి ఒక వ్యక్తికి ఐదు లక్షల రూపాయల చొప్పున రు. 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎక్స్ గ్రేషియా తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, పత్రాన్ని అందజేశారు. అశ్విని మరణంతో దేశం, ప్రపంచం ఒక యువ శాస్త్రవేత్తను కోల్పోయిందని మంత్రి అన్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మోతీలాల్, అశ్విని చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, అధికారులు తదితరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .