రైతు అభివృద్ధి, సంక్షేమo కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారా నే సాధ్యపడుతుంది
-రైతు రుణమాఫీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, , టిపిసిసి కార్యదర్శి రాంరెడ్డి గోపాల రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
రైతుల అభివృద్ధి, సంక్షేమంకొరకు కాంగ్రెస్ పార్టీమాత్రమే కృషి చేస్తుందని,గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఖజానా ఖాళీ అవడమే కాకుండా తెలంగాణ ప్రజలపై 7 లక్షల కోట్ల రూపాయల రుణ భారం మోపినప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కు కట్టుబడిరైతు రుణమాఫీ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని, రైతు రుణమాఫీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, టిపిసిసి కార్యదర్శి రాం రెడ్డి గోపాల్ రెడ్డి, సెంట్రల్ బ్యాంక్ సీఈవో అబీద్ ఉర్ రెహమాన్అన్నారు. మంగళవారం నాడు కామేపల్లి మండలంలోని తాళ్ల గూడెం బ్రాంచ్ మేనేజర్ మేళ రామస్వామి అధ్యక్షతన జరిగిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే రైతు రుణమాఫీ చేపట్టిందని, రైతుకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని, రైతుకు 2004 నుండి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయని, ఒకప్పుడు వ్యవసాయం చేయలేక రైతులు భూములమ్ముకుని వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రావడం వలన రైతులను అభివృద్ధి ప్రదాతలుగా మారిపోయారని, కోరం కనకయ్య పేర్కొన్నారు. మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ జిల్లా డిసిసిబి పరిధిలో 57,129 మంది రైతులకు దాదాపు 29 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందని, కామేపల్లి బ్రాంచ్ కు 913 మంది రైతులకు రెండు కోట్ల 40 లక్షల రూపాయలు రుణమాఫీ జరిగిందని వివరించారు, ఇంకా రుణమాఫీ రాని రైతులు అధికారులకు సరైన పత్రాలు చూపించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల డిసిసిబి డైరెక్టర్లు జిల్లాకు చెందిన మన రాష్ట్రమంత్రివర్యులు ను కలిసి ఏజెన్సీ ఏరియాలోకూడా వైయస్సార్ ప్రభుత్వం ఇచ్చినపట్టాలు పహానిలా ఆధారంగా రైతు రుణమాఫీ చేపట్టాలని వినతి పత్రం సమర్పించడం జరిగిందని, రాజకీయాలకతీతంగా జరిగే ఇలాంటి కార్యక్రమాలకు ప్రోటోకాల్ పాటించాలని ఉద్యోగులకు మల్లిబాబు యాదవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగింజల నర్సిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏపూరి మహేందర్, ఎస్.కె ఫతే మహమ్మద్ సీఐ తిరుపతిరెడ్డి కామేపల్లి ఎస్సై సాయి,జిల్లా సిపిఐ నాయకులు పుచ్చకాయల వెంకటేశ్వర్లు, ఏ ఓ తారా దేవి, సొసైటీ సీఈఓ ముత్తయ్య, మాజీ ఎంపీటీసీ లు రాo రెడ్డి జగన్నాథరెడ్డి, నల్లమోతు లక్ష్మయ్య గబ్రు నాయక్ , కామేపల్లి సొసైటీ వైస్ చైర్మన్ గుజ్జర్లపూడి రాంబాబు సొసైటీ డైరెక్టర్ బట్టు రమేష్, బానోత్ నరసింహ నాయక్, శీలం పుల్లయ్య, చల్ల మల్లయ్య, జక్కంపూడి వెంకటేశ్వర్లు కొండాయిగూడెం సొసైటీ చైర్మన్ ధనియాకుల హనుమంతరావు యువజన కాంగ్రెస్ నాయకుడు దేవళ్ల రామకృష్ణ, మరియు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, డైరెక్టర్లు, రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు


Comments