రైతులు ఆందోళన చెందవద్దు
--నీట మునిగిన భూములను పరిశీలించిన ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్దమందడి మండలం వెల్టూర్ గోపాల సముద్రం పూర్తిగా నిండడంతో బ్యాక్ వాటర్ తమ పంట పొలాలను ముంచేస్తుందని పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామ రైతులు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సోమవారం మద్దిగట్ల గ్రామ రైతులతో కలిసి నీటి మునిగిన భూములను పరిశీలించారు.
నీటి మునకకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.నూతనంగా నిర్మించిన చెరువు కట్ట నిర్మాణంలో అలుగును పెంచారని దాంతో తమ పొలాల్లోకి చెరువు నీరు చేరిందని రైతులు వాపోయారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువు ఎఫ్ టి ఎల్ ను పరిశీలించి తగు చర్యలు చేపట్టి.. రైతులకు సహకరించాలని నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు.కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.


Comments