వెల్టూర్ చెరువును సందర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
సప్తసముద్రాలలో ఒకటైన వెల్టూర్ గోపాల సముద్రాన్ని మంగళవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దమందడి మండలం వెల్టూర్ పెద్ద చెరువు నిండడంతో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వం కృషి వల్ల వెల్టూర్ చెరువును మరమ్మత్తు పనులను చేపట్టడం జరిగిందని, చెరువు కట్ట నిర్మితమై సుందరమైన నిర్మాణంతో చెరువును పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు. విస్తారమైన వర్షాలకు చెరువు నిండి అలుగు పారుతున్న సందర్భంగా గోపాల సముద్రాన్ని సందర్శించి అలుగు దగ్గర గంగమ్మ తల్లికి పసుపు,కుంకుమ,పూలు సమర్పించి పూజలు నిర్వహించారు. కట్టపైన ఉన్న కట్టమశమ్మ,వేణుగోపాలస్వామి ఆలయాలలో పూజలు నిర్వహించారు.అనంతరం కట్టపై కలియతిరుగుతూ నాయకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు వేణు యాదవ్,మాజీ సింగిల్ విండో అధ్యక్షులు విట్ట శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎం.పి.పి దయాకర్, మీడియా కన్వీనర్ నందిమల్ల. అశోక్, మల్లక్. సురేష్ కుమార్, గ్రామ మాజీ రైతు బంధు అధ్యక్షులు రఘువరన్ రెడ్డి , పార్టీ గ్రామ అధ్యక్షులు.కృష్ణా రెడ్డి,భాస్కర్ రెడ్డి,సంబ యాదయ్య,,ఆంజనేయులు,శ్రీధర్,మాజీ ఎం.పిటి.సి గణేష్,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments