నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఖమ్మం కార్పొరేషన్‌లో బుధవారం నాడు జరిగిన పలు వివాహ శుభకార్యాలకు బి.ఆర్‌.ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మొదటగా, ఖమ్మం కార్పొరేషన్ రాపర్తి నగర్‌కు చెందిన వేముల రవికుమార్ కుమారుడు వివాహ వేడుక ఇటీవల జరిగిన సందర్భంగా, మాజీ ఎంపీ నామ వారి స్వగృహంకు వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం స్వర్ణభారతి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన మల్లీడు నిర్మల వెంకట కోటయ్య కుమార్తె, బలపాల గ్రామ వాస్తవ్యులు హరినాథ్ బాబు కుమారుడి వివాహ వేడుకకు నామ నాగేశ్వరరావు వారి సతీమణి చిన్నమ్మ తో కలసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలానే ఖమ్మం కార్పొరేషన్ బైపాస్ రోడ్‌లో వాసిరెడ్డి కళ్యాణ మండపంలో జరుగుతున్న పారా శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు అలానే దొరేపల్లి ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న బొల్లెపల్లి కృష్ణవేణి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మొగిలి పాపిరెడ్డి ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్న గుడ్డూరి రామాజ్యోతి, రఘు కుమార్ కుమార్తె వివాహానికి , వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్న పారా శ్రీనివాసరావు కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు 

*చిన్నారికి మాజీ ఎంపీ నామ దీవెనలు*

ఖమ్మం నగరం లోని గొరిల్లా పార్క్ నందు జరుగుతున్న ప్రముఖ న్యాయవాది పొట్ల మాధవరావు మనుమరాలు మొదటి పుట్టిన రోజు వేడుకకు నామ నాగేశ్వరరావు వారి సతీమణి చిన్నమ్మ తో కలసి హాజరై చిన్నారిని దీవించారు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో పాటుగా ఆనందం, విజయాలతో కూడిన మంచి భవిష్యత్ ఉండాలని ఆశీర్వదించారు

ఈ కార్యక్రమాల్లో నామ సోదరులు నామ రామారావు, కృష్ణకుమారి, నామ సీతయ్య, భువనేశ్వరి దంపతులతో పాటుగా పార్టీ నాయకులు కనకమేడల సత్యనారాయణ, తాళ్లూరి జీవన్ కుమార్, మేళ్ళచెరువు వెంకటేశ్వరరావు, మోరంపూడి ప్రసాద్, రాకేష్, రమణ , పూర్ణ , అంబటి మాధవ్, ఆరెంపుల వీరభద్రం, ముదిరాజ్ శ్రీనివాస్, నామ సేవా సమితి సభ్యులు పాల్వంచ రాజేష్, కృష్ణ ప్రసాద్, పగడాల రవి తదితరులు పాల్గొన్నారు

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .