ఉమ్మడి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు...

పర్యావరణ హితంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుందాం...

ఉమ్మడి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు...

-మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఖమ్మం మాజీ ఎంపీ, బి.ఆర్.ఎస్. సీనియర్ నాయకుడు నామ నాగేశ్వరరావు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల వర్షాలు, మున్నేరు వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు అ గణనాథుని దీవెనలతో అండగా నిలబడాలని, ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేయాలని పిలుపునిచ్చారు. సమాజం మొత్తం కలిసి పని చేస్తేనే సమస్యలను అధిగమించగలమని నామ అన్నారు. పండుగ వేళలో వినాయక చవితిని పర్యావరణ స్నేహపూర్వకంగా జరుపుకోవాలనీ, మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించి పర్యావరణానికి హాని కలగకుండా పండుగను నిర్వహించాలని ఆయన కోరారు.

ఖమ్మం వరద బాధితుల సహాయార్ధం సిద్ధిపేట నుండి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యావసర సరుకులు పంపించడం మరియు రాజ్యసభ సభ్యులు బండి పార్ధ సారధి రెడ్డి కోటి విరాళం అందించినందుకు నామ అభినందనలు తెలుపుతూ, బి.ఆర్.ఎస్ శ్రేణులు అందరూ ఈ క్లిష్ట సమయంలో వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పలు స్వచ్చంద సంస్థలు వరద బాధితులను ఆదుకోవడంలో ముందంజలో ఉన్నందుకు ఆయన అభినందనలు తెలిపారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .