కాంగ్రెస్ తోనే పేద ప్రజలకు ఆరోగ్య భరోసా

- ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు కల్లెం వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ తోనే పేద ప్రజలకు ఆరోగ్య భరోసా

- సాయిగణేష్ నగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి సిఫారసు చెక్కుల పంపిణీ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే పేద ప్రజలకు ఆరోగ్య భరోసా సాధ్యమవుతుందని ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెం వెంకట్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హరినాథబాబు పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలం సాయిగణేష్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సిఫారసుతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేద ప్రజలకు అందని చెక్కులను సైతం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని లబ్దిదారులకు వాటిని అందించేందుకు కృషిచేస్తున్నారన్నారు. మంత్రి పొంగులేటి చొరవతో రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు ముందస్తుగా ఎల్ వో సీ లను కూడా మంజూరు అవుతున్నాయన్నారు. 55 మంది లబ్దిదారులకు సుమారు రూ. 22 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మద్ది వీరారెడ్డి, బోడా వెంకన్న, ఏనుగు వెంకట్ రెడ్డి, దండ్యాల బాబు, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వెంపటి రవి, అంబేడ్కర్, రానేరు మురళి, వెంకట నారాయణ, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .