సీఎం రేవంత్ అమెరికా టూర్‌లో పెట్టుబడుల వెల్లువ.. 5 రోజుల్లో ఎన్ని ఒప్పందాలంటే..?
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పది కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ అమెరికా పర్యటన ద్వారా వచ్చే పెట్టుబడులతో..రాష్ట్ర ఇమేజ్ రెట్టింపు అవుతుందని అధికారులు ప్రకటించారు
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పది కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ అమెరికా పర్యటన ద్వారా వచ్చే పెట్టుబడులతో..రాష్ట్ర ఇమేజ్ రెట్టింపు అవుతుందని అధికారులు ప్రకటించారు.
ఆగస్ట్ 3వ తేదీ నుండి అమెరికా పర్యటన చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకరావడమే లక్ష్యంగా సాగుతోంది. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి సీఎం రేవంత్, అమెరికాలో వివిధ కంపనీలతో MOU కుదుర్చుకున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై విపక్ష పార్టీ బీఆర్ఎస్ తప్పుబడుతోంది. ఇదంతా కేవలం తమ కుటుంబం కోసం ఒప్పందాలు చేసుకోవడానికి అమెరికా పర్యటన చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అమెరికా రిటర్న్స్ చేపట్టిన రేవంత్ రెడ్డి ఆగస్ట్ 13 వరకు అమెరికా పర్యటన కొనసాగనుంది. అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతుందని ప్రభుత్వం నుండి మంత్రులు అదే విధంగా పార్టీ పెద్దలు పదేపదే చెబుతున్నారు. ఈనెల మూడు నుండి అమెరికా పర్యటన చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పటివరకు పది కంపెనీల తో 16 ఒప్పందాలు జరిగాయని అధికారులు ప్రకటించారు. దీంతో పాటు కాగ్నిజెంట్ అనే అతి పెద్ద క్యాంపస్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోంది. ఇదే జరిగితే రాష్ట్రానికి 15 వేల ఉద్యోగ ఉపాధి దొరికే అవకాశం ఉంది.


Comments