70 ఏండ్ల పైబడిన వయస్సు నాది,50 ఏండ్ల రాజకీయ చరిత్ర ఉన్న నన్నే దూసించిన DCC అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

-జనగామ జిల్లా

70 ఏండ్ల పైబడిన వయస్సు నాది,50 ఏండ్ల రాజకీయ చరిత్ర ఉన్న నన్నే దూసించిన DCC అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

సర్వల నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

జనగామ తెలంగాణ ముచ్చట్లు :

జనగామ AMC కమిటీ విషయంలో అందరూ సీనియర్స్ తో చర్చించి, హైకమాండ్ సూచన మేరకు నిర్ణయం తీసుకుంటాను, అని నమ్మబలుకు కుంటూ ఇన్నిరోజులు నెట్టుకు వచ్చిన మా ఇంచార్జి కొమ్మూరి

ఎవ్వరితోను ఎటువంటి చర్చలు లేకుండానే,గతంలో కొమురవెల్లి దేవస్థానం, సిద్దుల గుట్ట దేవస్థానం ఉత్సవ కమిటీల విషయంలో వ్యవహరించిన సంగతి తెలిసిందే

చేర్యాల మార్కెట్ కమిటీని సైతం,ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే,రాజకీయాలకు సంబంధం లేని,కాంగ్రెస్ పార్టీలో ఏనాడు పనిచేయని నల్లనాగుల శ్వేత గారికి అమ్ముకున్నారు,అనే అపవాదు మూట కట్టుకున్నారు మా నాయకులు కొమ్మూరి

ఇప్పుడు జనగామ AMC చైర్మన్ అడిగిన నేను, 1978 లోనే 3 ఏండ్లు PACS చైర్మన్ గా, తర్వాత 2 పర్యాయాలు సుమారు 14 ఏండ్లు గ్రామ సర్పంచ్ గా,ఒకసారి 5 ఏండ్లు MPTC సభ్యులుగా,5 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగాసుమారు 9 ఏండ్లు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా ఒకసారి జిల్లా కార్యదర్శి గాఇంకొక సారి జిల్లా పార్టీ ఉపాధ్యాక్షులు గా కొనసాగుతున్న నేను పోయి నాకు AMC చైర్మన్ కావాలని కోరగా,నువ్వు ఎవడివి నన్ను అడగడానికి అని నా వైపు ఉరిమి ఉరిమి చూడడం జరిగింది

నాకు ఎట్లయిన MLA టికెట్ అయితే ఇవ్వరు కదా, కనీసం AMC జనగామ చైర్మన్ పదవి అయిన మీరు ఇవ్వడానికి,నేను తీసుకోవడానికి అర్హున్ని కాదా అని అడుగుతున్న సర్వల

కొమ్మూరి ఓటమి చెందడం అనేది,ఆయన స్వయంకృతా అపరాదమే తప్ప,ఎవరు ఓడించలేదు,భవిష్యత్ లో కూడా ఇంకో 4 B ఫామ్ లు వరుసగా ఇచ్చిన కూడా, ఒక్కటీ గెలువలేడు,మా నాయకులు కొమ్మూరి

కొమ్మూరి జిల్లా అధ్యక్షులుగా అయి సంవత్సరమ్ పూర్తి అవుతున్న కూడా,జిల్లా కమిటీని వేసి,అనౌన్స్ మెంట్ చేసి, ఒక్కసారైనా పెద్ద ఎత్తున జిల్లా స్థాయి విసృత సమావేశం పెట్టగలి గారా కనీసం జిల్లా బాడీ మీటింగ్ కూడా పెట్టలేక పోతున్న అసమర్డుడు మా నాయకులు కొమ్మూరి

నియోజకవర్గం ఇంచార్జి హోదాలో కూడా 10 మండలాల అధ్యక్షులను మాత్రమే ప్రకటించి,మిగతా కమిటీలను వేసేంత తీర్వాటం లేని, నాయకులు మా కొమ్మూరి

ఏ రకంగా చూసిన కొమ్మూరి ద్వారా పార్టీ బలహీన పడడం జరుగుతుంది అని జిల్లా మొత్తం తెలిసిన విషయమే,కాబట్టి పార్టీ బలోపేతం అయి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల రావాలంటేహైకమాండ్ తక్షణమే జోక్యం చేసుకుని,కొమ్మూరిని మార్వగలరని,పార్టీని కాపాడగలరని సవినయంగా కోరుకుంటున్నాము.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .