నేను చదివింది క్రిస్టియన్ స్కూల్లోనే

-ఎంపీ కడియం కావ్య

నేను చదివింది క్రిస్టియన్ స్కూల్లోనే

స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని గ్రామంలో జీసస్ ఆఫ్ నజరేత్ మినిస్ట్రీ ఆ మందిరంలో

పాస్టర్ పిట్టల లూకా (ఉప్పన్న) నూతనంగా నిర్మిస్తున్న మందిరంలో చర్చి దర్వాజా ప్రతిష్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. 

ఎంపీ కడియం కావ్య కు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించిన పాస్టర్ కుటుంబ సభ్యులు అనంతరం అక్రమానుదేశించి ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఇలాంటి పరిశుద్ధమైన కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉందన్నారు. నేను చదువుకున్నది క్రిస్టియన్ పాఠశాలలోనని మా దిన చర్యలు ప్రార్థనతోనే ఆరంభమయ్యేవని గుర్తు చేశారు. మనందరి మధ్యతరగతి కుటుంబాలు గనుక మీ పిల్లలను మంచి చదువులు చదువుపించాలని సూచించారు చదివే ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలువ పెట్టిందన్నారు. నన్ను ఎంపీగా గెలిపించడానికి క్రైస్తవులందరూ చర్చిలలో మీ ఆ ప్రభువు దగ్గర ప్రార్థించినందుకే మీ ప్రార్ధన ఫలమే పార్లమెంటు సభ్యురాలుగా నేను రెండు లక్షల 27 వేల మెజారిటీ నాకు లభించిందన్నారు. కచ్చితంగా క్రైస్తవులకు నా వంతు సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. దేవుని మందిరంలో దర్వాజా ఎత్తే కార్యక్రమానికి నన్ను పిలిచిన స్థానిక పాస్టర్ లూకా దంపతులకు కుటుంబ సభ్యులకు ఈ సమావేశంలో పాల్గొన్న చర్చి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో పాస్టర్ జి. మార్కు, డి. భాస్కర్, కె థామస్, సిహెచ్ కుమార్, బి రాజు, లాజర్, మాజీ ఎంపీటీసీ బూర్ల లతా శంకర్, గుర్రం రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శిరీష్ రెడ్డి, సంఘ పెద్దలు గుర్రం సుధీర్, కరణాకర్, విజయ్ కుమార్, పిట్టల రమేష్, రాహుల్, కట్ట కుమారస్వామి, సంఘ విశ్వాసులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .