కాసేపట్లో కేంద్ర మంత్రి అమిత్ షా తో సీఎం రేవంత్ భేటీ..

కాసేపట్లో కేంద్ర మంత్రి అమిత్ షా తో సీఎం రేవంత్ భేటీ..

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

 ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు తెలంగాణ రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి.రాష్ట్రంలో వర్షాలు, వరదలు మిగిల్చిన అపార నష్టంపై పూర్తి వివరాలను రేవంత్ రెడ్డి అందజేయనున్నారు.బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించనున్నారు.ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి.గ్రామీణ, మండల, జిల్లా స్థాయి రోడ్లు పెద్దఎత్తున దెబ్బతిన్న పరిస్థితులను వివరించనున్నారు.వరద బాధితులకు గత ప్రభుత్వం ఇస్తున్న పరిహారాన్ని పెంచిన విషయాన్ని తెలియజేయడంతో పాటు మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కేంద్రానికి విన్నవించనున్నారు.సుమారు రూ.5,438 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రాథమికంగా కేంద్రానికి నివేదించారు.తెలంగాణలో వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ నెల 2న ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు.వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వివరించేందుకు ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ కోరారు.ఇదిలా ఉంటె పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనట్లు తెలుస్తుంది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .