వరద బాధితులకు అండగా జమాఅతె ఇస్లామి హింద్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు:
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరదలు వచ్చి సర్వం కోల్పోయి నిరాశరులైన 47 డివిజన్ వెంకటేశ్వర నగర్ లోని వరద బాధితులకు జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో వరద ముంపు బాధిత కుటుంబాలకు ఇండ్ల దగ్గరికి వెళ్లి మధ్యాహ్నం భోజనం పంపిణీ చేయడం జరిగింది. జమాఅతె ఇస్లామి హింద్ బాద్యులు నిరాశరులైన వరద బాధితులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర మాజి కార్యదర్శి మొహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి నష్టపోయిన కుటుంబాలకు సరైన నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు . మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ వెంటనే నిర్మించాలని అన్నారు జమాఅతె ఇస్లామి హింద్ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటుందని అన్నారు. జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా మాట్లాడుతూ వరద బాధితులకు రాత్రి భోజన సదుపాయం మరియు రేపు ఉదయం టిఫిన్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు జమాఅతె ఇస్లామి హింద్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యాక్రమములో జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ సమి, వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ అధ్యక్షులు అబ్దుల్ మలిక్, అబ్రార్ అలీ షేక్ రఫీ , మాజి పట్టణ అధ్యక్షులు ఖలిల్ అహ్మద్ ఖాన్, అబ్దుస్ సుబూర్, నిజాముద్దీన్, గౌస్, యసుఫ్ షరీఫ్, ఫయాజ్, షెక్ ఇలియాస్ ఎస్ ఐ ఓ జిల్లా అధ్యక్షులు ఆమెర్ తదితరులు పాల్గొన్నారు


Comments