సీతారాం ఏచూరి మృతి పట్ల ఖమ్మం మాజీ ఎంపీ నామ సంతాపం

-ఒక మంచి మిత్రుడ్ని కోల్పోయాను.. 

సీతారాం ఏచూరి మృతి పట్ల ఖమ్మం మాజీ ఎంపీ నామ సంతాపం

-విలువలు, సిద్ధాంతాల కలబోతనే ఏచూరి రాజకీయ జీవితం - మాజీ ఎంపీ నామ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ(ఏం) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి కుటుంబ సభ్యులకు నామ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను ఒక మంచి మిత్రుడ్ని కోల్పోయానని నామ ఆవేదన వ్యక్తం చేశారు. 15వ లోక్ సభ సమయంలో తన గెలుపుకోసం మిత్రపక్షాలు చేసిన కృషిని, థర్డ్ ఫ్రంట్ లో ఏచూరి క్రియాశీలకంగా వ్యవహరించిన విషయాన్ని నామ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దేశం ఒక ప్రజా పోరాట యోధుడిని కోల్పోయిందని, విలువలు, సిద్ధాంతాల కలబోతగా తన రాజకీయ ప్రస్థానాన్ని చివరి వరకు కొనసాగించిన సీతారాం ఏచూరి ఆదర్శప్రాయులన్నారు. భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా సీతారాం ఏచూరి గుర్తింపు పొందారని ఆయన విద్యార్జనలో కూడా అగ్రగామిగా నిలిచిన సీతారాం, ప్రెసిడెంట్స్‌ ఎస్టేట్ స్కూల్‌లో ఇంటర్‌ పూర్తి చేసిన ఆయన సీబీఎస్ఈ పరీక్షల్లో ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారని, సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో బీఏ(ఆనర్స్‌‌) ఆర్థికశాస్త్రం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయం లో అరెస్ట్ అయిన ఏచూరి, తన ప్రస్థానాన్ని మరింత పదిలపరిచి, ప్రజల పక్షాన నిలిచిన నాయకుడున్నారు. ఆయన పార్లమెంటులో ఎన్నో సమస్యలను ప్రజల కోసం చర్చించి, ప్రశ్నించిన మేటి నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. విలువలు, సిద్ధాంతాల కలబోతగా తన రాజకీయ ప్రస్థానాన్ని చివరి వరకు కొనసాగించిన సీతారం ఏచూరి ఆదర్శప్రాయులని తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .