ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనేత వైఎస్.
15వ వర్దంతి సందర్భంగా నివాళి అర్పించిన ఎమ్మెల్యే శ్రీహరి
మక్తల్, తెలంగాణ ముచ్చట్లు:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనేత అని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. వైఎస్ 15వ వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో పాదయాత్ర చేసి అన్ని వర్గాలను ఏకం చేశారని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, ఏక కాలంలో రైతు రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 104, 108, ఇందిరమ్మ ఇళ్లు లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం అలుపెరుగని కృషి చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత అమరచింత మండలం తుక్యానాయక్ తండాకు చెందిన సవరమ్మకు 28,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు కట్టా సురేష్ గుప్తా, మఖ్తల్ మాగనూరు మండల అధ్యక్షులు గణేశ్ కుమార్, ఆనంద్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ రవి కుమార్, కున్షి నాగేందర్, శ్రీనివాస్, కావలి రాజేందర్, నూరుద్దీన్, లాలా, కల్లూరి గోవర్ధన్, గుంతలి రవి, తదితరులు పాల్గొన్నారు.


Comments