బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ ని కలిసిన మందకృష్ణ మాదిగ

బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ ని కలిసిన మందకృష్ణ మాదిగ

తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల:

 ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం ఢిల్లీ నుండి హైదరాబాద్ కి వచ్చిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గురువారం జనగామ జిల్లా బిఆర్ఎస్ నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ ను హైదరాబాద్ లోని మల్లాపూర్ లో గల తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని,శాలువతో సత్కరించారు.అనంతరం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ను స్థాపించి పట్టువదలకుండా తాను చేసిన ఉద్యమం వలన వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా జడ్జిమెంట్ రావటం ముమ్మాటికి మంద కృష్ణ మాదిగ కృషి అని అన్నారు,30 సంవత్సరాలుగా మంద కృష్ణ చేసిన ఉద్యమాలకు పలితం దక్కిందన్నారు.తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాడిన సమయంలో బిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కూడా తనకు గుర్తు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గూడూరు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .