ప్రభాకర్ రెడ్డికి మంత్రి పొంగులేటి అభినందనలు
Views: 10
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు:
పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలంలో బయాలజీ స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న పెసర ప్రభాకర్ రెడ్డి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికవ్వడం పట్ల తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం , సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమాజానికి, పాఠశాల విద్యార్థులకు ప్రభాకర్ రెడ్డి అందిస్తున్న సేవలను కొనియాడారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడు ఎంపికవ్వడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments