అశ్వారావుపేట నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి విస్తృత పర్యటన

*పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు  *రూ.11 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

అశ్వారావుపేట నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి విస్తృత పర్యటన

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి మంగళవారం అశ్వారావుపేట నియోజకవర్గం లో ముమ్మరంగా పర్యటించారు. తొలుత ములకలపల్లి మండలం మంగపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ఎంపీ రఘురాంరెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ బాబుతో కలిసి ప్రారంభించారు. తమ ప్రభుత్వం పేదల ఆరోగ్యo కోసం.. అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో.. వైద్యులు మరింత అప్రమత్తంగా ఉండీ ప్రజలకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అనంతరం వినాయకపురం, నారాయణపురం గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలను ప్రారంభించారు.

*లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ*

అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించి 50 మందికి రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయగా.. ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. అశ్వారావుపేటలోని శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ లో.. అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఈ చెక్కుల పంపిణీ నిర్వహించారు. మొత్తం 50 మంది లబ్ధిదారులకు రూ. 11, 14000 మేరకు లబ్ధి చేకూరిందని తెలిపారు. పేదలందరికీ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .