నేడు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఉదయం 10.30 గంటలకు పాల్వంచ ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. అదేవిధంగా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని మేదరబస్తీలో కౌన్సిలర్ పూర్ణ కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 02.45 గంటలకు ఖమ్మం నగరంలోని అల్లీపురం కొత్తగూడెంలో శీతల రామసంగం కుటుంబాన్ని, సహకారనగర్ లో కిలారు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శిస్తారని పేర్కొన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కూసుమంచి క్యాంపు కార్యాలయంలో గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ చేస్తారన్నారు. అనంతరం రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారని దయాకర్ రెడ్డి తెలిపారు. పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను , అభిమానులను కోరారు


Comments