ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సోమ, మంగళ వారాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 08.00 గంటల నుంచి ఇల్లందు నియోజకవర్గంలోని ఇల్లందు పట్టణం, ఇల్లందు మండలంలోని ముకుందాపురం, మెడికుంట, ఎల్లందుళ్లపాడు, బుగ్గవాగు, బొజ్జాయిగూడెం తదితర గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు నేలకొండపల్లి మార్కెట్ యార్డులో జరిగే నేలకొండపల్లి మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహెూత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు. మంగళవారం ఉదయం 10గంటలకు ఖమ్మం నగరం ఒకటవ డివిజన్ లోని రైస్ మిల్లు రోడ్డులో, ఉదయం 10.30గంటలకు 59వ డివిజన్ దానవాయిగూడెం రోడ్డు నెంబర్ 8 లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం కూసుమంచి మండలంలో నూతన జూనియర్ కళాశాలను ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే కూసుమంచి జెడ్ పి ఎస్ ఎస్ స్కూల్ అదనపు తరగతులను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభిమానులకు మంత్రి పొంగులేటి అందుబాటులో ఉంటారని దయాకర్ రెడ్డి తెలిపారు.


Comments