ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శనివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం హట్యాతండాలో పాలేరు ఎడమ కాలువకు గండి పడిన ప్రదేశాన్ని పరిశీలిస్తారని తెలిపారు. 10.30 గంటలకు గట్టుసింగారంలో స్వాతంత్ర్య సమరయోధుడు రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారని పేర్కొన్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటల వరకు ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు సత్తుపల్లి నియోజకవర్గంలోని వినాయక మండపాలను, రాత్రి ఏడున్నర గంటలకు కొత్తగూడెం నియోజకవర్గంలోని వినాయక మండపాలను సందర్శిస్తారని దయాకర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని మంత్రి పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .