ముందరి తండా ప్రజల దాహార్తిని తీర్చిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండల పరిధిలోని ముందరి తండాలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. తండాలో నీటి ఎద్దడి ఉందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఆయన శనివారం బోరు బండిని పంపించగా తండాలో బోరు వేయించినట్లు మాజీ సర్పంచ్ జయంతి శంకర్ నాయక్ తెలిపారు. గ్రామంలో నీటి సమస్య పరిష్కారం అయ్యిందని శనివారం వేసిన బోరులో నీరు పుష్కలంగా రావడం జరిగిందని మాజీ సర్పంచ్ జయంతి శంకర్ నాయక్ , కాంగ్రెస్ కార్యకర్తలు రాములు నాయక్, మోహన్ నాయక్, చంద్రు, కిషన్, దేవుజా , గౌడ , క్రిష్ణ, హనుమంతు, రమేష్, శంకర్, చందు నాయక్ లు, మహిళా కార్యకర్తలు నీలమ్మ, గోరమ్మ, మోతిభాయి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


Comments