వరద ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే
హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు:
గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్ పరిధిలోని భీమారం నక్షత్ర కాలనీ, బాలానగర్ కాలనీ లో నీట మునిగిన ప్రాంతాలను అధికారులతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సందర్శించారు.ఈ సందర్బంగా
ఎమ్మెల్యే కాలనీ లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గత ప్రభుత్వం స్మార్ట్ సిటీ ఫండ్స్ వినియోగించుకోక తిరిగి వెళ్లిపోగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు వెనక్కి తీసుకురావడం జరుగుతుందన్నారు. స్మార్ట్ సిటీ ఫండ్స్ నుంచి 55వ డివిజన్ కి సుమారు 2కోట్ల రూపాయలు నిధులు కేటాయించమని కమిషనర్ అడుగుతానని అలాగే సత్వరమే సిడిఎఫ్ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చి సీసీ రోడ్, డ్రైనేజీ ఏర్పాటు చేయిస్తానని అన్నారు. కాలనీ ప్రజలు సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మొదటిసారి నక్షత్ర కాలనీకి విచ్చేసిన ఎమ్మెల్యేకు కార్పొరేటర్ మరియు కాలనీ వాసులు బొకే ఇచ్చి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర రావు, స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు గడ్డం శివరాం ప్రసాద్, 56 డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, డివిజన్ నాయకులు మార్కరాజు (డైని), రణధీర్, కాలనీ అధ్యక్షుడు సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.


Comments