బాబాయ్ మృతి...నివాళులు అర్పించిన ఎమ్మెల్యే.

బాబాయ్ మృతి...నివాళులు అర్పించిన ఎమ్మెల్యే.

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన తన బాబాయ్ కె.గోపాల్ రెడ్డి సోమవారం మృతి చెందడంతో విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి  కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బాబాయ్ గోపాల్ రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.అధైర్య పడొద్దని కుటుంబానికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు.ఎమ్మెల్యే వెంట వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, వెంకట్రాం రెడ్డి అల్వాల గ్రామ పెద్దలు నాయకులు తదితరులు ఉన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .