పలు కుటుంబాలకు ఎంపీ రఘురాంరెడ్డి పరామర్శ
అండగా ఉంటామంటూ అభయం
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, ప్రేమలత దంపతులు హఠాన్మరణం చెందగా.. ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాo రెడ్డి శుక్రవారం బిల్లు పాడు గ్రామంలోని నివాసానికి వెళ్లారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబుతో కలిసి మృతుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణమూర్తి కుమారులు కిషోర్, రాములను ఓదార్చారు. అనంతరం ఎంపీ ఎన్నికల కాలంలో వివిధ కారణాలతో మృతి చెందిన వారి నివాసాలకు వెళ్లి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సూరయ్య బంజర తండాలో భూక్యా రాము, లంకా సాగర్ గ్రామంలో ధరంసోతు కిరణ్ కుమారుడు చనిపోగా.. వారి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. ఆర్థిక సాయం అందజేసి..కాంగ్రెస్ పార్టీ, తాను అండగా ఉంటామని.. అభయమిచ్చారు.
*జానీ మియా తల్లికి నివాళి*
క్రీసెంట్ ఫార్మా కంపెనీ యజమాని ఎస్కే. జానీమియా తల్లి రాబియా బీ అనారోగ్యంతో చనిపోగా.. వారి నివాసానికి వెళ్లి మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఆమె కుమారులు జానీ మియా, అబ్దుల్ రెహమాన్ లను ఓదార్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకులు పాప బత్తిని నగేష్ నివాసానికి వెళ్లి .. పరామర్శించారు.
*ఈ కార్యక్రమాల్లో..* కాంగ్రెస్ నాయకులు దీవెల కృష్ణయ్య, కొప్పుల చంద్రశేఖర్ రావు, కొమ్మినేని బాబు, కొమ్మినేని వెంకటేశ్వర్లు, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, కేశవరెడ్డి, నారా పోగు వెంకట్, జోసఫ్, మల్లికార్జున్, శ్రీను, రామ అప్పారావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


Comments