వరద బాధితులకు నిత్యావసర కిట్లు అందజేసిన ఎంపీ రఘురాం రెడ్డి

అందరికీ అండగా ఉంటామని అభయం 

వరద బాధితులకు నిత్యావసర కిట్లు అందజేసిన ఎంపీ రఘురాం రెడ్డి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 ఇటీవల మున్నేరు వరదలతో దెబ్బతిన్న 29వ డివిజన్ లోని సుందరయ్య నగర్ లైన్ ప్రాంతoలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి మంగళవారం రాత్రి పర్యటించారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. ఇంకా దుప్పట్లు, కొబ్బరి నీళ్ల బాటిళ్ళు అందజేసి.. భోజన సదుపాయం కల్పించారు. ఒక్కసారిగా వరద పోటెత్తి.. తాము తీవ్రంగా నష్టపోయామని స్థానికులు ఆవేదన వ్యక్తo చేశారు. స్పందించిన ఎంపి ఆ ప్రాంతం లో కలియతిరిగి చూశారు. అనంతరం లోక్ సభ సభ్యులు రఘురాo రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడి సమస్యలన్నీ పరిష్కరిస్తామని అన్నారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చూస్తామని, బురద మేటల తొలగిoపు పూర్తి చేయించి, రోడ్ల మరమ్మతులు చేయిస్తామని అన్నారు. వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, నాయకులు ఉపేందర్, ఇమామ్ భాయ్, స్ఫూర్తి ఓం రాధా కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .