ఖమ్మం ఖిల్లా ను పరిశీలించిన ఎంపీ రఘురాంరెడ్డి

ఖమ్మం ఖిల్లా ను పరిశీలించిన ఎంపీ రఘురాంరెడ్డి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు 

ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక ఖిల్లా ను ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి సోమవారం పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి ఖిల్లాను ఎక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఖిల్లా పైకి రోప్ వే ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ఇది పూర్తయితే.. రాష్ట్రంలో మంచి పర్యాటక కేంద్రం గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖిల్లా పైన కలియతిరిగి.. చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రులు, ఎంపీ చర్చించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .